Thursday, November 6, 2025
E-PAPER
Homeజిల్లాలుపెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి : విద్యార్థి సంఘాలు

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి : విద్యార్థి సంఘాలు

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి 
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కమిటీ సంపూర్ణం మద్దతు తెలియజేసింది. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్,ఈశ్వర్,హరీష్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలు యాజమాన్యాలు  విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని కొందరు విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితిలో ఏర్పడుతున్నాయని ఇళ్ళకే పరిమితం అవుతున్నారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -