నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న రహదారులు, కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యం దృష్ట్యా ఏ పనీ ఆలస్యమవకుండా చూడాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న రహదారులు, ఇంకా ప్రారంభం కాని సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ రోడ్ల పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని సమయపాలనతో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈలు సుదర్శన్ రెడ్డి, లక్ష్మణ్ రావు, డీఈలు పవన కుమారి, సత్యనారాయణ, విష్ణు వర్ధన్, ఏఈలు, తదితర శాఖల సిబ్బంది తో పాటు తదితరులున్నారు.
పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES