నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్రవ్యాప్తంగా నున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్క్ హైదరాబాద్ వద్ద పెన్షనర్లు వేలాదిమందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కెమెరాకు సోమవారం నిజామాబాద్ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. సిర్ప లింగయ్య పెన్షనర్లపై పాడిన పాటలు ఇందిరా పార్క్ వద్దనున్న పెన్షనర్లు అలరించాయి. జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్లు కే లక్ష్మయ్య, పాలకుర్తి కృష్ణమూర్తి తదితరుల నేతృత్వంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు పెన్షనర్ల ధర్నా జరిగింది.
నగదు రహిత వైద్యం, పేడ్డింగ్ డీఏ ల విడుదల, పే రివిజన్ కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని 40% ఫిట్మెంట్తో అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ మహా ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో నిజామాబాదు నుండి ఆల్ పెన్షనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజాంబాద్ డివిజన్ ప్రెసిడెంట్ శిర్ప హనుమాన్లు, జార్జ్, లావు వీరయ్య పురుషోత్తం ,సాంబశివరావు , బన్సీలాల్, మదన్మోహన్, తదితరుల నేతృత్వంలో ధర్నాకు హాజరయ్యారు.
వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES