కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలి
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు
నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెయింట్స్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద శుక్రవారం పెన్షనర్లు పెద్ద ఎత్తున మానవహారాన్ని నిర్మించి ధర్నాను నిర్వహించారు.
01.01.2026 నుండి కేంద్ర ప్రభుత్వం పాత – కొత్త పెన్షనర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం ప్రారంభించింది.8 వ పే కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అందుకు నిరసనగా ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం టాప్రా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు మన -మన నిజామాబాద్ జిల్లాలో కూడా మానవహారంం పెద్ద ఎత్తున పెన్షనర్లు మానవహారాన్ని నిర్మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ మానవహారాన్ని ప్రారంభిస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు మాట్లాడుతూ.. మధ్యతరగతి ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు తీసుకొస్తుందని దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మానవహారంలో జిల్లా కార్యదర్శి మదన్మోహన్ నిజామాబాద్ అధ్యక్షులు శిరప హనుమాన్లు ఫారెస్ట్ రాధా కిషన్, జిల్లా నాయకులు జార్జి, పురుషోత్తం, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల యూనియన్ నాయకులు ప్రతాపరెడ్డి ,హుస్సేన్, జిల్లా నాయకులు పుష్పవల్లి, లలిత, మేరీ మేడమ్, ప్రసాద్, వెంకట్రావు, సిర్ప లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.