Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలి : సీపీఐ(ఎం)

వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలి : సీపీఐ(ఎం)

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : గ్రేటర్ హైదరాబాదులోని సికింద్రాబాద్ ఆర్డీవో పరిధిలోని కంటోన్మెంట్, సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గాల పలు డివిజన్లోని నివసించే బస్తీ ప్రజలు పెన్షన్స్ కోసం గత అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకొని పెన్షన్స్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జి. నరేష్, ఏం అజయ్ బాబు, సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ ఆర్. మల్లేష్, కంటోన్మెంట్ జోన్ నాయకులు ఎం. సత్యనారాయణ, సనత్ నగర్ జోన్ నాయకులు పి మల్లేష్ సీపీఐ(ఎం) నాయకత్వం సికింద్రాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి టి. సాయికుమార్ గారిని కలిసి సమస్యలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పలు బస్తీలలో పెన్షన్స్ గురించి దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగుల వారందరికీ ఎంక్వయిర్ చేసి వెంటనే పెన్షన్స్ మంజూరు చేయాలని, సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ సభ్యులు జి. నరేష్, ఏం. అజయ్ బాబు సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ ఆర్ మల్లేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ 2000 వేల పెన్షన్ ను పెంచి 4000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా వికలాంగులకు ఇప్పటికే ఇస్తున్న 4000 పెన్షన్ను 6 వేలకు పెంచి ఇవ్వాలని , అదేవిధంగా ఆర్డీవో పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యను పరిష్కరించాలని తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరినారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ ఆర్డిఓ టి. సాయికుమార్ గారు స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -