Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోతుల బెడద నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించాలి 

కోతుల బెడద నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించాలి 

- Advertisement -

పొదిల్ల చిట్టిబాబు సీపీఐ(ఎం) జిల్లా నాయకులు 
నవతెలంగాణ -గోవిందరావుపేట 

కోతుల బెడద నుండి ప్రజలను పంట పొలాలను రక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పొదిల్ల చిట్టిబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని వసర గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు ఆధ్వర్యంలో కోతుల బెడద నుండి ప్రజలను పంట పొలాలను రక్షించాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని చిట్టిబాబు ప్రజలకు వివరించారు.

ప్రతిరోజు గ్రామానికి చెందిన ప్రజలు కోతుల బెడద వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు ప్రధానంగా మహిళలు కోతుల దాడిలో గాయపడుతూ చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఇంటినిండా కూరగాయలు ఉండేవి ఇంటి ఆవరణలో జామ అరటి సపోటా పలు రకాల పండ్ల మొక్కలను కూడా రైతులు పెంచుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కోతులు ఎక్కడ వస్తాయోనని ప్రజలే ముందుగా వాటిని తొలగిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచక ప్రజాజీవనం కొట్టుమిట్టాడుతోంది. మనకున్న ఏకైక పంట వరి పంట పొట్ట దశలో కోతుల గుంపు దాడి చేయడం వల్ల పంట పొలాలు అక్కరకు రాకుండా పోతున్నాయి. పెట్టుబడులు వేల రూపాయల్లో పంటలకు వెచ్చిస్తున్న ఈ తరుణంలో కోతులు పంటలను సర్వ నాశనం చేయడం వల్ల దిగుబడును రాక రైతులు అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్నారు. వ్యాపారులు సైతం వ్యాపారం చేసుకోలేని పరిస్థితి కోతుల వల్ల దాపురించిది . చిరు వ్యాపారులు పండ్లను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పళ్ళు అమ్మితే వచ్చే లాభం కన్నా కోతుల ద్వారా జరిగే నష్టం అధికం కావడంతో చిరు వ్యాపారులు విలవిలలాడిపోతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేతకానితనంగా పట్టి పట్టనట్టుగా  ఉంటుంది. కోతుల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రజల ప్రజల మానాన ప్రజలను గాలికి వదిలేసింది. పోరాటాల ద్వారానే సమస్యను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.

ప్రజలు వ్యాపారులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావడం హర్షించదగ్గ విషయమని ప్రజలు తోడుంటే ఎంతటి సమస్యలైనా పోరాడి పరిష్కరించుకోవచ్చని అన్నారు. దశల వారి ఉద్యమాల ద్వారా కోతుల బెడద నుండి విముక్తి కొరకు సంఘటితంగా ఉద్యమిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, తీగల ఆదిరెడ్డి వర్తక సంగం సభ్యులు చిరు వ్యాపారులు మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -