నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీర్కూర్ మండలంలోని పలు గ్రామాలలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేయడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని బరంగేడ్గి గ్రామంలో రాత్రి గ్రామస్తులపై కుక్కలు దాడి చేయడంతో గ్రామస్తులు పరుగులు పెట్టారు. ఇందులో ఎవరికి గాయాలు కాలేదని గ్రామస్తులు తెలిపారు. మండలంలో పలుచోట్ల పాఠశాలకు వెళ్ళే విద్యార్థులపై దాడులకు దిగుతున్నాయని, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే వారిపై దాడి చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి.
వాహనాలపై ప్రయాణించే వారిని కుక్కలు గుంపులుగా వెంబడిస్తున్నాయని కుక్కల సమస్యపై గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో బీర్కూర్ మండలంలో దాదాపుగా ప్రతి గ్రామంలో సుమారు 50 నుంచి 100 వరకు కుక్కలు ఉన్నట్లు సమాచారం పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే గ్రామాల్లో ఈ పరిస్థితి తెలెత్తుతుంది చెప్పవచ్చు, దీంతో వీధుల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండడంతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కుక్కల బెడదతో ప్రజలు బేజారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES