Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు 

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు 

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
చోల్లేడు కాంగ్రెస్ అభ్యర్థి వంగూరి అశోక్ ను గెలిపించేందుకు గ్రామంలోని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం గ్రామంలోని పలు వార్డులలో  ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు గ్రామంలోని ప్రజలు వందలాదిమంది తరలివచ్చి అశోకుని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ .. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యల ను పరిష్కరిస్తానని అన్నారు.

కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు. గ్రామంలోని ప్రజలు అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధికి అడుగులు పడతాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని గొప్ప సంకల్పంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో తమ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదిస్తే అధిక నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -