Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎస్ఐఆర్ పేరుతో బీహార్ ప్ర‌జ‌ల‌ను పుల్స్ చేస్తున్నారు: ఆర్జేడీ

ఎస్ఐఆర్ పేరుతో బీహార్ ప్ర‌జ‌ల‌ను పుల్స్ చేస్తున్నారు: ఆర్జేడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బీహార్ ఆర్జేడీ నేత తేజిస్వీ యాద‌వ్ ఎన్నిక‌ల సంఘం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట‌ర్ జాబితాలో పేద‌ల ఓట్ల‌ను తొల‌గిస్తుంద‌ని ఆరోపించారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన యువ‌తీ యువ‌కుల ఓట్ల‌ను తొల‌గించి, వారి ఓటు హ‌క్కును అడ్డుకుంటుంద‌న్నారు. ఓట‌ర్ అధికార్ యాత్ర ఇవాళ‌ బీహార్‌లోని న‌వాడ‌ ప‌రిధిలో మూడో రోజు ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది.ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రాణ‌మున్న వ్య‌క్తుల‌ను..మ‌ర‌ణించ‌న‌ట్లుగా ఈసీ పేర్కొంద‌ని, లోక్ స‌భ ఎన్నిక‌ల‌ప్పుడు ఓట్లు వేసిన వ్య‌క్త‌ల‌ను..ఇప్పుడు చ‌నిపోయార‌ని ఈసీ వాదిస్తుంద‌ని తేజిస్వీ యాద‌వ్ ఆరోపించారు. త‌ప్పుల స‌ర్వేల‌తో ల‌క్ష‌ల మంది ఓట్ల‌ల‌ను రాష్ట్రంలో తొల‌గించార‌న్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీహార్ ప్ర‌జ‌ల‌ను ఈసీ త‌క్కువ అంచ‌నావేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad