– తహసిల్దార్ చందా నరేష్
– ఎంపీడీవో కుమార్
– ఎస్సై చిర రమేష్ బాబు
నవతెలంగాణ-నెల్లికుదురు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు మండలం తహసిల్దార్ చందా నరేష్ ఎస్సై చిరా రమేష్ బాబు, ఎంపీడీవో కుమార్ అన్నారు. కాజ్వేల వద్ద బుధవారం ప్రమాదం పొంచి ఉన్న స్థలాలను సందర్శించి తగు జాగ్రత్తలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు వంకలు నిండి బొర్లుతున్నాయని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రమాదాలు పొంచి ఉన్న స్థలాల వద్దకు ఎవరు కూడా వెళ్ళవద్దని తెలిపారు. వాగులు వంకలు బొర్లుతున్న ప్రాంతాల వద్ద చేపలు పట్టేందుకు వెళ్లవద్దని అన్నారు. ఈ వర్షాలకు అక్కడక్కడ ఉన్న కాజు వేలు నీటి ప్రవాహం ఎక్కువ ఉంటున్నదున అక్కడకి ప్రజలు వెళ్లవద్దని కోరినట్టు తెలిపారు. గ్రామాలలో ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉండాలని అన్నారు. ఏదైనా సమస్య ఉన్న ప్రమాదంలో చిక్కుకున్న నాకు సమాచారం అందించినట్లయితే మీ వద్దకు వెంటనే వచ్చి కాపాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులు రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.
మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



