- Advertisement -
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుచునయని ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు ప్రజలను కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ భారీ వర్షానికి ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు అండగా ఉండాలని, ధాన్యం తడవకుండా పట్టాలు అందజేయాలని ఆదేశించారు. ప్రయాణాలకు సాహసం చేయకూడదని తెలిపారు.
- Advertisement -



