Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే తగు చర్యలు చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో వానలు, వరదల పరిస్థితిపై చరవాణిలో కలెక్టర్ తో పాటు ఆర్ అండ్ అధికారి ఈఈ, పంచాయతీ ఈఈ జిల్లా వ్యవసాయ అధికారి, ఇంచార్జ్ డిహెచ్ఎం, మున్సిపల్ కమీషనర్ తో ఎమ్మెల్యే ఆదివారం రాత్రి సమీక్ష చేశారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాలని సూచించారు. మరో రెండు ముడు జులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అధికారులు ప్రజలకు అవసరమైనవిధంగా సహాయపడాలని సూచించారు. కాలువలు, వాగులు, వంకలు పారుతూ, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నీటితో నిండి ఉన్నాయని ఈ నేపథ్యంలో కొద్దిపాటి వరద వచ్చి నా నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉంది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -