వరి కోతలు మొదలు పెట్టని రైతులు మూడు రోజులు వాయిదా వేసుకోవాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలి
ప్రాజెక్టులు, పరిసర ప్రాంతాల్లో అధికారులు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి
ప్రాణ, ఆస్తి, పశువుల నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఈఈ పీఆర్, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఎగువ మానేరు, మధ్య మానేరు, మూల వాగు మానేరు వాగు తదితర పరిసర ప్రాంతాల్లోకి రైతులు, ప్రజలు వెళ్లకుండా నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టాన్ని అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తమ పరిధిలోని కాజ్వేలు, కల్వర్టల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే తమ సిబ్బందితో వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. బ్రిడ్జిలు, రహదారులు ఏమైనా దెబ్బతింటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, కావాల్సిన మరమ్మతులు చేయాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పోసిన దాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల బాధ్యులు ఆయా శాఖల అధికారులు తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలవకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకా వరి కోతలు మొదలు పెట్టిన రైతులు మరో మూడు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. ప్రాణ, ఆస్తి, పశువుల నష్టం వాటిల్లకుండా చూడాలని, ఏమైనా నష్టం జరిగితే జిల్లా అధికారులు దృష్టికీ తీసుకురావాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉంటాయని ఎంపీడీవోలు, ఎంపీలు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని, నీరు నిలవకుండా నిల్వ ఉండకుండా చూడాలని, ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరూ చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సూచించారు. కల్వర్టులు దాటువద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు. కంట్రోల్ రూం అందుబాటులో ఉంటుంది. వర్షం, వరద ప్రభావిత ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 93986 84240 ఉందని. వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



