Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
మండల వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మకూరు తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నివసించరాదని ఆయన హెచ్చరించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజల సంరక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. తుఫాన్ సమయంలో భారీ వర్షాలు, గాలివానలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ళలో ఉండేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరమైతే గ్రామస్థులు సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా ఆశ్రయ కేంద్రాలకు తరలించుకోవాలని ఆయన సూచించారు. తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -