- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి : డ్రైడేతో ప్రజలు స్వచ్ఛమైన జీవనం సాగించవచ్చునని..డ్రైడేలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రజలను భాగస్వామ్యం చేయాలని డీఎంహేచ్ఓ ధనరాజ్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహేచ్ఓ ధనరాజ్ సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టిక, మందుల గది, ల్యాబ్ తీరును పరిశీలించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు .వైద్యాధికారి మాధురి, ఎంపీహేచ్ఎస్ సులోచన, సిబ్బంది లక్ష్మి, పాల్గొన్నారు.
- Advertisement -



