Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రి వైపే ప్రజల మొగ్గు

కాంగ్రెస్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రి వైపే ప్రజల మొగ్గు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఆయన గెలుపు కోసం గ్రామ ప్రజలు భారీగా ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. అంతేకాదు.. 20 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ఉషా సంతోష్ మేస్త్రి గెలుపు కోసం ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటూ.. గెలుపుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె సోహెల్, టి గణేష్, బి సాయి, యు నాందేవ్, యు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -