Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం

- Advertisement -

– వర్షపు నీరు మూసీలోకి వెళ్లేలా ప్రణాళికలు : సమీక్షలో సీఎం రేవంత్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
: హైదరాబాద్‌లో కురిసే వర్షాలతో ఉత్పన్నమయ్యే వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కురిసి న వర్షానికి హైదరాబాద్‌ నగరం అతలాకుత లమైన పరిస్థితులపై శుక్రవారం సీఎం అధికారులతో విపులంగా చర్చించారు. వానలతో తలెత్తే వరద ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారుల అభిప్రా యాలను తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తడానికి కారణమని అధికారులు సీఎంకు వివరించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడెల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. ఎ భవిష్యత్‌లో నగరంలో ఇలాంటి సమస్య పునరావతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు చెప్పారు. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చన్నారు. ఆ దిశగా హైదరాబాద్‌ నగర అభివద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలని వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img