Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సభలకు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలి 

సభలకు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలి 

- Advertisement -

రోజువారి ఖర్చుల వివరాలను అందజేయాలి 
అల్లర్లు స్పృష్టిస్తే అభ్యర్థులపై అనారాత వేటు తప్పదు 
ఎన్నికల ఖర్చుల జిల్లా పరిశీలకురాలు జయశ్రీ 
నవతెలంగాణ – పాలకుర్తి

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే సభలకు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎన్నికల ఖర్చుల జిల్లా పరిశీలకురాలు జయశ్రీ సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో గల బృందావన్ గార్డెన్ లో ఎంపీడీవో వర్కల వేదవతి అధ్యక్షతన జరిగిన ఖర్చులపై అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎన్నికల ఖర్చుల మండల పరిశీలకురాలు స్వర్ణలత, ఎస్సై దూలం పవన్ కుమార్ లతో కలిసి జయశ్రీ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రోజువారి ఖర్చులను అందజేయాలని సూచించారు. 5000 జనాభా కలిగిన గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు 1,50,000, వార్డు సభ్యులు 30000, 5000 జనాభా దాటిన గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు 250000, వార్డు సభ్యులు 50,000 ఖర్చు చేసుకోవచ్చని సూచించారు.

ఎన్నికల సందర్భంగా తీసిన సేవింగ్ ఖాతా నుండి డబ్బులు డ్రా చేసి ఖర్చులను వివరించాలన్నారు. ఎన్నికల అధికారులు, పోలీస్ శాఖ అనుమతులు తీసుకున్న అనంతరం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల సందర్భంగా హాజరయ్యే ప్రజలను అంచనా వేసి ప్రజలతోపాటు టోపీలు, కండువాలు జెండాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల అధికారులు ఖర్చును గుర్తిస్తారని తెలిపారు. పోటీలు పడుతూ ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. ర్యాలీలను అడ్డుకోరాదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తప్పమన్నారు. ఎన్నికల సందర్భంగా అల్లర్లను సృష్టిస్తే అభ్యర్థులు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనార్హత వేటు వేస్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సిబ్బందికి, పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూత్రం సరస్వతి, ఎన్నికల సిబ్బంది, పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -