Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పోగుల నాగరాజు (37) గత కొంతకాలంగా మద్యం, పేకాట వ్యాసనాలకు బానిసై, అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధతో మానసిక ఒత్తిడికి లోనై,   ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 9వ తేదీన గడ్డి మందు త్రాగి అపస్మారక స్థితిలో ఇంటికి రావడంతో, కుటుంబ సభ్యులు గమనించి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. మృతుడికి కొడుకు కూతురు కలరు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad