న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో దగ్గు సిరప్ మరణాలపై దర్యాప్తు చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల కమిటీతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని పిటిషన్ పేర్కొంది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లను సిబిఐకి బదిలీ చేయాలని కూడా కోరారు. పరిశ్రమల్లోని ద్రావకాల్లో వినియోగించే పారిశ్రామిక ద్రావకాలలో వినియోగించే విషపూరిత రసాయనం డైథిలిన్ గ్లైకాల్ కలిగిన కలుషితమైన దగ్గు సిరప్‌ల తయారీ, నియంత్రణ, పరీక్ష మరియు పంపిణీపై సమగ్ర విచారణ చేపట్టాలని, మెడిసిన్ తయారీకి సూచనలను జారీ చేయాలని కోరింది.
ప్రస్తుతం నిషేధం విధించబడిన కోల్డ్రిఫ్ సిరప్ స్టాక్‌ను స్వాధీనం చేసుకోవాలని, వాటి విక్రయాలు, పంపిణీ జరగకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. సిరప్‌లను విషపూరితం కాలేదని నిర్థారించేందుకు ఎన్‌ఎబిఎల్ ప్రయోగశాలకు పంపాలని పిటిషన్ కోరింది. మధ్యప్రదేశ్‌లో దగ్గు సిరప్ కోల్డ్రిఫ్‌తో 14మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. కోల్డ్రిఫ్ సిఫారసు చేసిన ప్రభుత్వ వైద్యుడు, తమిళనాడుకు చెందిన తయారీదారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.
దగ్గు సిరప్‌తో మరణాలపై జ్యుడీషియల్ దర్యాప్తు కోరుతూ పిటిషన్
- Advertisement -
- Advertisement -