Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సకాలంలో వేతనాలు రావడం లేదని ఎంపీడీవోకు వినతి పత్రం

ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లకు సకాలంలో వేతనాలు రావడం లేదని ఎంపీడీవోకు వినతి పత్రం

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
రాష్ట్ర ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం  ఆదేశాల మేరకు  జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నాలుగు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు సమస్యల వలయంలో ఇబ్బందుల పాలవుతున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ ల పట్ల చిన్నచూపు చూస్తుందని, వేతనాలు నెలవారీగా అందజేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నామని వారికి తెలిసిన పట్టి పట్టనట్టు ఉంటున్నారని అన్నారు. కుటుంబాలు గడవాలంటే ప్రతి నెల సమయానుకూలంగా తమ వేతనాలను తమ ఖాతాలో  జమ చేయాలని తెలిపారు. గత మూడు నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బందుల పాలవుతున్నామని ,  ఇలాగైతే ఉద్యోగం చేయడం మాకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే విధులను బహిష్కరిస్తామని తెలిపారు. వినతి పత్రం అందించే కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -