నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీలాసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పాండురంగారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం నుంచి ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ (మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రమే)తోపాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఈనెల 31న అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 31 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశముందని తెలిపారు. అదేనెల ఐదో తేదీన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల ఆరు, ఏడు తేదీల్లో కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు చేరాలని సూచించారు. ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు. ట్యూషన్ ఫీజును చెల్లించాలని తెలిపారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://శ్రీaషషవ్aసఎ.్‌స్త్రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
నేటినుంచి పీజీలాసెట్ తుదివిడత కౌన్సెలింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



