Wednesday, July 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త జంటను బలిగొన్న ఫార్మా ప్రమాదం

కొత్త జంటను బలిగొన్న ఫార్మా ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు ఘటన చాల మంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద మృతుల్లో రెండు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న భార్యభార్తలు కూడా ఉన్నారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌రెడ్డి, పెనికలపాడు గ్రామానికి చెందిన శ్రీరమ్య రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాడ మాసం తర్వాత బంధుమిత్రులను ఆహ్వానించి పెద్దల సమక్షంలో ఘనంగా వేడుకలు జరుపుకుందని అనుకున్నారు. కానీ ఇంతలో విధి వక్రించింది. సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న పేలుడు ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -