Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూలే సేవలు మరువలేనివి..

పూలే సేవలు మరువలేనివి..

- Advertisement -

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
నవతెలంగాణ – తుంగతుర్తి
మహిళల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు సమాజంలో అణచివేతకు గురవుతున్న మహిళలకు,బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ఆకాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా భావించే పరిస్థితుల్లో,ఎన్నో అవమానాలను భరించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారని గుర్తుచేశారు.

జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ,బాల్య వివాహాల నిర్మూలనకు,వితంతు పునర్వివాహాలకు ఆమె అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని,మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆమె మార్గంలో నడవడమే మనం ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్,గోపగాని రమేష్ గౌడ్, నాగమల్లు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -