Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారం పోగానే ప్రజలను మరిచిన గువ్వల..

అధికారం పోగానే ప్రజలను మరిచిన గువ్వల..

- Advertisement -

అదే బాటలో గుండూరు రాములు..
నల్లమల్ల ప్రజలలో చైతన్యం చాలా అవసరం 
నవతెలంగాణ – అచ్చంపేట
రాజకీయ ఎన్నికలలో గెలుపు, ఓటమి లు సహజం. ప్రజలకు నచ్చితే ఓటేసి గెలిపిస్తారు.. గెలుపొందిన వ్యక్తి అదే తరహాలో ప్రజలకు సేవ చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తే అదే ప్రజలు మళ్లీ మరోసారి అధికారం అప్పగిస్తారు. ఎన్నికల్లో గెలిచాం…ప్రజలకు నాకు ఏంటి సంబంధం అనే తరహాలో ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడిస్తారు.  అచ్చంపేట శాసనసభ ఎన్నికల్లో అచ్చం అదే జరిగింది. వనపర్తి జిల్లా నుంచి అచ్చంపేట  ఉద్యమ పార్టీ పేరుతో వచ్చి స్థానిక ప్రజలను మచ్చిక  చేసుకుని వలస కూలీ బిడ్డను అని చెబుతూ ప్రజలను నమ్మించాడు. దింతో నల్లమల్ల అమాయక ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. కోట్లాది రూపాయలు, 100 ఏకురాల భూములు సంపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో అహంకారంతో ప్రజలను, జర్నలిస్టులను విస్మరించాడు. విలేకరుల సమావేశాలకు, ఇతర అధికారుల సమావేశాలకు  సెల్  ఫోన్ల ను తీసుకురానిచ్చే వారు కాదు.. అంటే గువ్వలబాలరాజు ఎంత అహంకారంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా గమనించిన ప్రజలు 2023 నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చరిత్రలో  లేనివిదంగా 50 వేల ఓటర్ల తేడా తో ఘోరంగా  ఓడించారు. 10 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన గువ్వల బాలరాజు తన స్వార్ధ రాజకీయం కోసం ప్రజలను విస్మరించారని, అధికారం ఉన్నప్పుడు కొందరికి దళిత బంధు పథకం  పేరుతో 10 లక్షలు ఇచ్చారు వారిలో కొందరు  మాత్రమే ఆయన వెంట ఉన్నట్లు పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే బాటలో గుండూరు రాములు…

ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పోతుగంటి రాములును 1994 నుంచి అచ్చంపేట ప్రజలు ఆదరిస్తూ అధికారమిస్తూ వచ్చారు. నల్లమల్ల ప్రజలు ఓటేసి గెలిపించడంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో క్రీడల శాఖ మంత్రిగా అవకాశం దొరికింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు రాజకీయ పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగయింది. ఈ సందర్భంగా కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పోతుగంటి రాములు కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ లో చేరారు. 2018లో నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేశారు. మళ్లీ నల్లమల్ల ప్రజల తో పాటు నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు ఆదరించి ఓట్లు వేసి ఎంపీగా గెలిపించారు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఏనాడూ ప్రాధాన్యత కల్పించలేదనేది నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.

గత 30 ఏళ్ల చరిత్ర చూసుకుంటే అచ్చంపేట ప్రజల అభివృద్ధి సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్లీ గత ఏడాది 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన కుమారుడు భరత్ ప్రసాద్ ను బిజెపి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ప్రజలు ఆదరించలేదు ఓడిపోయాడు. కొందరు తమ స్వార్థ  రాజకీయం కోసం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. వారి పట్ల నల్లమల ప్రజలు చైతన్యం  కావలసిన అవసరం ఉంది. అర్హులైన  పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని అడిగే  ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకుడు అచ్చంపేట లో కనిపించడం లేదని నియోజకవర్గంలోని మండలాలలో గ్రామాలలో చర్చించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -