- పట్టింపులేని..అధికార యంత్రాంగం
- రోడ్లపై విచ్చలవిడిగా పందులు, కోతులు, కుక్కల విహారం
- ప్రమాదాల బారిన వాహనదారులు
- నవతెలంగాణ-బెజ్జంకి
అధికారులు విధుల్లో చూపే నిర్లక్ష్య దోరణితో పందులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.నిత్యం కార్యాలయాలకు వచ్చామా..వచ్చాం.నెల రోజులకు మనకు వేతనం వచ్చిందా సరిపాయేన్నా చందంగా మండలంలోని అధికార యంత్రాంగం పని తీరు ఉంది. అధికారులు తమ వేతనాలపై చూపుతున్న శ్రద్ధ విధుల నిర్వర్తనలో..ప్రజల సంక్షేమంపై చూపడంలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.ముఖ్యంగా మండల కేంద్రంలోని అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది.మండల కేంద్రంలో పందులు,కుక్కలు, కోతులు రోడ్లపై స్వైర విహారం చేయడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఈ ప్రమాదాల్లో కొందరు మరణిస్తుండగా, మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు.రోడ్లపై విచ్చలవిడిగా పందులు,కోతులు,వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.వాహనదారులు ప్రమాదాల గురవుతున్న అధికార యంత్రాంగం పట్టింపులేని విధంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ప్రజల్లో వినిపిస్తోంది.ఇప్పటికైనా అధికారులు విధుల్లో నిర్లక్యం వీడీ రోడ్లపై తిష్ట వేస్తున్న కుక్కలు,కోతులు,ఇళ్ల అవరణాల్లో విహరిస్తున్న పందులను అరికట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్లక్ష్యపు అధికారులను వెంటనే తొలగించాలి: బైఠాయించి ధర్నా చేపట్టిన మృతుని బందువులు
ఈ నెల 20న మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై పందులు ద్విచక్ర వాహనాన్ని డికొట్టడంతో ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర పర్శరాం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.ప్రమాదంలో వాహనదారుడి తలకు తీవ్ర రక్తస్రావమవ్వగా 108 అంబులెన్స్ యందు మేరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ బాధితుడు శనివారం మృతి చెందాడు.దీంతో మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మృతుని బందువులు బైటాయించి పందులను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామ ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శిని విధుల్లో నుండి వెంటనే తొలగించాలని ధర్నా నిర్వహించారు.
పందుల స్వైరవిహరంతోనే బొర్ర పర్శరాం ప్రమాదానికి గురై మృతి చెందాడని అవేదన వ్యక్తం చేశారు.పందులు,కుక్కలు,కోతులను అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మృతుని బందువులు అసహనం వ్యక్తం చేశారు.జిల్లాధికారులు స్పందించి ప్రజల ప్రాణాలకు కారణమవుతున్న పందులు,కుక్కలు,కోతులను అరికట్టి ..నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న గ్రామ ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.