Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పైప్ లైన్ లీకేజీ.. బురదమయమైన రోడ్డు

పైప్ లైన్ లీకేజీ.. బురదమయమైన రోడ్డు

- Advertisement -

ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని మానేరు నది నుండి వల్లెంకుంట వరకు ఉన్న మంచినీటి పైప్ లైన్ కి భారీ స్థాయిలో లీకేజిలతో కావడంతో తాగు నీరు రోడ్డుపై వృథాగా చేరడంతో రోడ్లు బురదమయంగా మారింది. దీంతో నిత్యం మానేరు నుండి వల్లెంకుంట వరకు వెళ్లాలంటే స్థానికులు,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధించిన అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళే ట్రాక్టర్ లు బురద రోడ్ లో దిగబడి పోతున్నాయని,అసలే ఖరిపీబీపొలాల కోతల సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీకేజిల వల్ల తాగు నీరు సైతం కలుషితం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి పైప్ లైన్ కి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ ప్రజలు రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -