- Advertisement -
- – జలదిగ్బంధం లో కుర్తి .. పర్యవేక్షించిన సబ్ కలెక్టర్
నవతెలంగాణ – పిట్లం: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులగా కురుస్తున్న భారీగా వర్షాలకు మండలంలోని బోల్లక్ పల్లి పల్లి బ్రిడ్జి, కల్హేర్ భద్రప్పల వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో అధికారులు రాకపోకలను స్తంభింప చేశారు. కాగా కుర్తి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలకు మంజీరా నది వరద ఉదృతంగా ప్రవహించటము. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం నిండడంతో ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటిని ప్రాజెక్టు గేట్ల ద్వారా వదలడంతో కుర్తి గ్రామం చుట్టూ వరద నీరు ప్రవహించగా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పర్యవేక్షించి గ్రామ ప్రజలు ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని ఎట్టి పరిస్థితులలో ప్రజలు బయటకు వెళ్ళవద్దని సూచించారు. గతంలో కుర్తి గ్రామానికి వెళ్లేందుకులో లెవెల్ బ్రిడ్జి కారణంగా వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకు గ్రామం జలదిగ్బంధంలో ఉండేది. గత ప్రభుత్వ హయాంలో హై – లెవెల్ బ్రిడ్జి నిర్మించినప్పటికీ ఈ ఎడాది భారీ వర్షాల వరద ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రఘు, తాసిల్దార్ రాజ నరేందర్ గౌడ్, ఆర్ ఐ శీతల్, పంచాయతీ సెక్రటరీ బలరాం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -