Thursday, September 4, 2025
E-PAPER
spot_img
HomeNewsపీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతి గౌడ్ కు ఆత్మీయ సత్కారం

పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతి గౌడ్ కు ఆత్మీయ సత్కారం

- Advertisement -

నవతెలంగాణ మణుగూరు: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కు బదిలీపై వెళుతున్న మణుగూరు ఏరియా పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కు మణుగూరు ఏరియా ఆపరేటర్ల ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీత లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవలసి ఉందన్నారు. సింగరేణి ఉద్యోగులుగా సమిష్టి కృషితో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని రక్షణకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అధికారులు ఏముందని వస్తుంటారు పోతుంటారు పర్మినెంట్ గా ఉండేది కార్మికులేనని అన్నారు. తన ఉద్యోగపర్వంలో పీకే ఓ సి తో ఇక్కడి ఉద్యోగులతో తనకున్న అనుబంధం ఎన్నడు విడదీయలేనిదని ఇక్కడ ఉద్యోగుల పని సంస్కృతి, కార్మిక సంఘాల పారిశ్రామిక సంబంధాలు, ఉద్యోగుల సామాజిక సేవ తనకి ఎంతగానో నచ్చుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాజర్ పాష ,హెడ్ ఓవర్ మెన్ సిహెచ్ క్రాంతి కుమార్, షేక్ గఫూర్ పాషా, ఎస్.కే మెహబూబ్, రాజయ్య, బి. శ్రీనివాస్, కే.యాదగిరి, తిరువూరు అశ్విన్, మణితేజ, మునిగెల, పృథ్వీ, సయ్యద్ ఆసిఫ్, మున్వర్ శ్రీనివాసమూర్తి, కర్నే సారయ్య, సిహెచ్ కామేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad