నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని అరిజోనా విమానాశ్రయానికి సమీపంలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. దీనిపై నేషనల్ ట్రాఫిక్ సేఫ్టీ బ్యూరో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదం గురించి అధికారులు మాట్లాడుతూ, బీచ్‌క్రాఫ్ట్ 300 అనే చిన్న డ్యూయల్-ప్రొపెల్లర్ వైద్య రవాణా విమానం మధ్యాహ్నం సమయంలో చిన్లే విమానాశ్రయం సమీపంలో నేలపై కూలింది. దీంతో మంటలు చెలరేగాయని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. విమానం ఒక రోగిని తీసుకెళ్లడానికి స్థానిక ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో విమానం ప్రమాదం..నలుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES