బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా
బ్రసిల్లా : విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేయడం కాదు, మొక్కలను నాటాలని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించారు. ట్రంప్ విధించిన సుంకాలతో ద్రాక్షపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లూలా ద్రాక్ష మొక్కను నాటుతూ ట్రంప్‌ను ఉద్దేశించి మాట్లాడారు. హింసను నాటడం లేదా ద్వేషాన్ని నాటడం కాదు, మొక్కలను నాటాలనే సందేశాన్ని ఇస్తున్నానని అన్నారు. ”మీరు ఏదో ఒక రోజు బ్రెజిల్‌ను సందర్శిస్తారని, మనం చర్చలు ద్వారా నిజమైన బ్రెజిల్‌ను గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సాంబ, సాకర్, కార్నివాల్‌ను ఇష్టపడే బ్రెజిల్ ప్రజలు అమెరికా, చైనా, రష్యా, ఉరుగ్వే , వెనిజులాలను ఇష్టపడతారు. మేం అందరినీ ప్రేమిస్తున్నాం” అని అన్నారు. బ్రెజిల్‌పై విధించిన సుంకాలు అమెరికా వాణిజ్య భాగస్వామిని దెబ్బతీసే అత్యంత తీవ్రమైనవని, ఇవి ఇతర దేశాల మాదిరిగా కాకుండా బ్రెజిల్‌పై విధించిన సుంకాలు బహిరంగంగా రాజకీయ ప్రతీకార చర్యలని అన్నారు. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద ఆర్థికవ్యవస్థకు కీలకమైన అనేక ఎగుమతులను అమెరికా టారిఫ్‌లు ప్రభావితం చేయనున్నాయి.
విద్వేషాన్ని..హింసను కాదు మొక్కలు నాటండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES