Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి..

మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి..

- Advertisement -

తాడిచర్ల హస్కుల్లో హెడ్ మాస్టర్ తిరుపతి
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని మండల కేంద్రమైన తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్ తిరుపతి తెలిపారు. గురువారం పాఠశాల ఆవరణలో కాపురంలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో 200 వివిధ రకాల మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు పంపిణీ చేసి నాటినందుకు ఏఎమ్మార్ యజమాన్యానికి హెడ్ మాస్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దృష్ట్యా వారి అభివృద్ధికి కంపెనీ యాజమాన్యం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్ ఉద్యోగులు అభిషేక్,రమణ మూర్తి,నవీన్,నరేశ్,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -