– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. గురువారం మండల కేంద్రం శివారులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి నీళ్ళు పోశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాల మనుగడ మనం ప్రస్తుతం నాటే మొక్కలపైనే ఆధారపడి ఉందన్నారు. నేడు మనం నటుతున్న మొక్కలు, వృక్షాలై భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బుజ్జి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, సుంకరి గంగాధర్, సుంకేట శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES