Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

- Advertisement -

నవతెలంగాణ అడ్డగూడూర్
ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అడ్డగూడూరు లో బిఆర్ఎస్  పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆశీస్సులతో, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పూజారి వనజ సైదులు గౌడ్ అన్నారు. గ్రామంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనను ఎన్నికల్లో గెలిపిస్తే అడ్డ గూడూరు గ్రామంలో ముందుగా కోతుల సమస్య , కుక్కల పెడదా లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామంలో డ్రైనేజీ , సీసీ రోడ్లు ,వీధిలైట్లు వేయిస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. గ్రామపంచాయతీ నిధులు గ్రామ అభివృద్ధికి ఉపయోగపడేలా నిర్వర్తిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్ రెడ్డి, దాసరి బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు నాగులపల్లి దేవగిరి, సోమిరెడ్డి పురుషోత్తం రెడ్డి, బాబు మహాజన్, తుప్పతి మల్లయ్య, పయ్యావుల మహేష్, బాల్యంల అరవిందు, బాల్యంల రామకృష్ణ, వార్డు సభ్యులు కంచి మచ్చ గిరి, లోకేష్, పూజారి నాగరాజు, సురేష్, బాల్యంల అవినాష్, పయ్యావుల మత్స్యగిరి, గోదలి ధనమ్మ, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -