నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో అలాస్కాలో జరిగిన సమావేశం గురించి ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పుతిన్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు.ఈ విషయంలో భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని.. రాబోయే రోజుల్లో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ అమలుపై ఏకాభిప్రాయానికి రాలేదు. పుతిన్-ట్రంప్ సమావేశం భారత్‌పై ప్రభావం అసంపూర్ణంగా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆదేశానికి ఆర్థికంగా అండదండాలు అందిస్తూ, యుద్ధానికి ప్రోత్సహిస్తున్నారని యూఎస్ ప్రెసిడెంట్ ఆరోపిస్తూ..భారత్ పై 25శాతం అదనపు సుంకాలు విధించామని ప్రకటించారు. అలాస్కా వేదిక జరిగిన చర్చలు..రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు నిస్తాయని, ఆ తర్వాత సుంకాల పెంపుపై ఇండియాకు ఊరట లభిస్తుందని అంతా భావించారు.కానీ ట్రంప్-పుతిన్ భేటీలో చర్చలు విఫలమై, భారత్ కు నిరాశ కలిగించాయి.