Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంబ్రిట‌న్ రాజు ఇచ్చిన క‌దంబ్ మొక్క‌ను నాటిన పీఎం మోడీ

బ్రిట‌న్ రాజు ఇచ్చిన క‌దంబ్ మొక్క‌ను నాటిన పీఎం మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌లె ప్ర‌ధాని మోడీ త‌న 75వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. పీఎం బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయా దేశాల అధినేత‌లు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఈక్ర‌మంలో భార‌త్ ప్ర‌ధానికి బ్రిట‌న్ మూడో రాజు ఛార్లెస్ వినూత్న‌రీతిలో శుభాకాంక్ష‌లు తెలియజేశారు. క‌దంబా మొక్క‌ను బ‌హుమ‌నంగా పంపి.. భార‌త్ ప‌ట్ల త‌న‌కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా బ‌ర్త్ డే గిప్ట్‌గా ప్ర‌త్యేకంగా పంపించిన కదంబ్ మొక్కను ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. రెండు దేశాల మధ్య స్నేహం పర్యావరణ స్థిరత్వానికి ఉమ్మడి నిబద్ధతను సూచిక‌గా ఈ మొక్కను కింగ్ చార్లెస్ ప్రధాన మంత్రికి బహూకరించారని బ్రిటిష్ హై కమిషన్ ఎక్స్ వేదిక‌గా పేర్కొంద‌ని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -