నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్‌సీవో సదస్సు ముగింపు తర్వాత ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
అంతకు ముందు చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం ప్రారంభానికి ముందు మోడీ-పుతిన్ ప్రత్యేకంగా కలుసుకుని చాలా సేపు సంభాషించుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా మరొకసారి మోడీ-పుతిన్-జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా.. కనీసం పట్టించుకోకుండానే మోడీ వెళ్లిపోయారు. గ్రూప్ ఫొటో దిగాక కూడా అలానే చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.