నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్‌తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్‌పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరో తరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.