- Advertisement -
- గత 37 సంవత్సరాల క్రితం మాదిరి ఈసారి పొంగుతున్న పోచారం..
- చుట్టుపక్కల గ్రామాల వారికి హెచ్చరికలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ..
నవతెలంగాణ నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు కెపాసిటీని మించి పొంగిపొర్లుతుంది మంగళవారం సాయంత్రం ప్రారంభమైన తీవ్ర వర్షా ప్రభావంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. ప్రాజెక్టులోకి 1,47,640 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తున్నట్లు డి ఈ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు నుండి 1,47,640 క్యూసెక్కుల నీరు పొంగిపోతున్నట్లు ఆయన తెలిపారు. పోచారం ప్రాజెక్టు కెపాసిటీని మించి నీరు పొంగిపొర్లడంతో ప్రాజెక్టును తాకి ఉన్న కట్ట మట్టి కొట్టుకుపోయి గండి ఏర్పడింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న గ్రామాల వారు అలర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -