నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ద్వారా పంటల సాగు కొరకు బుధవారం రోజు ఏఎంసీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నుండి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు డి ఈ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏ, బీ రెండు జోన్ల రైతులు ఈ నీటిని వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. 15 రోజులపాటు నీటి విడుదల పది రోజులపాటు నీటి నిలిపివేత ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఈ ఈ మల్లేష్, ఆర్డీవో పార్థసింహారెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వేముల కిరణ్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీరామ్ గౌడ్, మైనార్టీ అధ్యక్షులు ఇమామ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి దివిటి కృష్ణయ్య, సుధాకర్, నర్సాగౌడ్, డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, ఆరిఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పోచారం నీటి విడుదల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES