Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపూర్ణ చందర్‌పై పోక్సో కేసు నమోదు

పూర్ణ చందర్‌పై పోక్సో కేసు నమోదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఆధారంగా అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు శనివారం మీడియాతో పాటు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు.

స్వేచ్చ ఆత్మహత్యకు పూర్ణ చందర్ కారణం అంటూ కూతురు, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పూర్ణచందర్.. తన లాయర్ తో వచ్చి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయడం.. ఆత్మహత్య కు ప్రేరేపించినందుకు..ప‌లు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad