– క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి పై అవగాహన
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే చట్టబద్ధ నిబంధనలను ప్రింట్,ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం పోలీస్ శాఖ సాదారణ ప్రక్రియ అయినా కూడా నిబంధనలు అతిక్రమించే వ్యక్తులపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా కేసులు నమోదు చేయడం తరచూ చేసే పనే.
కానీ ఈసారి మాత్రం అశ్వారావుపేట పోలీసులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గ్రామాల కే వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి,ఎన్నికల నియమావళి పట్ల అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. ఎన్నికలలో శాంతి భద్రతలు పాటించేందుకు ఇది పెద్ద ముందడగగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
శుక్రవారం సీఐ నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ లు యయాతి రాజు, కె.అఖిల ల బృందం ఉట్లపల్లి, వేదాంతపురం, గాండ్లగూడెం, అనంతారం గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో చేయాల్సినవి,చేయకూడనివి, ప్రచార నిబంధనలు, శాంతి భద్రతలు,డబ్బు,మద్యం,ప్రలోభాల పై చర్యలు వంటి అంశాలను సవివరంగా తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంతో గ్రామాల్లో ఇరుపక్షాలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, ఎన్నికలు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా సజావుగా జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



