Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై పోలీసుల అవగాహన

సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై పోలీసుల అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై కలిగే నష్టాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై రాజు శుక్రవారం మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌ పేట్ గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించామని తెలిపారు. అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలోకి వచ్చినా.. లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే 100కు ఫోన్ చేయాలని సూచించారు.

అదేవిధంగా సైబర్ నేరాల నుండి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అలాగే సైబర్ మోసాలు జరిగితే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రామ భద్రత కోసం సీసీటీవీ కెమెరాల స్థాపన, నిర్వహణ ప్రాధాన్యతను కూడా వివరించామన్నారు. గ్రామంలో ప్రస్తుతం సుమారు 12 సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించామని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకొస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -