Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యోగా దినోత్సవానికి హాజరైన పోలీస్ కమిషనర్

యోగా దినోత్సవానికి హాజరైన పోలీస్ కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ద్వారా శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు.మొట్ట మొదలు జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ..మన జీవితంలో ఒక భాగంగా యోగా ఉండాలని ఆయన సూచించారు శారీరిక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది అన్నారు. యోగా అనేది శరీర దృఢత్వానికి మనసు ప్రశాంతతకు చాలా ఉపయోగకరమైన దాని సూచించారు. యూవత డ్రగ్స్ వాడకం తగ్గించాలని తెలియజేశారు. జూన్ 26వ తారీఖున ఆంటీ డ్రగ్స్ డే రావడం అదే నెలలో 21 వ తారీఖున యోగా రావడం మంచిదని అన్నారు. అనంతరం వివిధ రకాల యోగ ఆసనాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్ )  బస్వారెడ్డి , అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ )  రాంచంధర్ రావ్, నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపల్ సూర్యనారాయణ , జిల్లా వ్యాప్తంగా గల యువజన సంఘాలు వారు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగులు వ్యాపారస్తులు క్రీడాకారులు, యోగా గురువులు సంగీత డాక్టర్ తిరుపతిరావు గంగాధర్ ప్రభాకర్ వెంకటేశ్వర్లు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad