Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించిన పోలీస్ కమిషనర్ 

అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించిన పోలీస్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ మరియు ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్నటువంటి వారిని చెక్ చేశారు. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్ లు నిర్వహించి జరిగింది. రాత్రి సమయాలలో మళ్లీ తిరిగి నట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -