నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఆదివారం పట్టణంలోని శోభాయాత్ర సాగబోయే ప్రధాన రూట్‌ను , రహదారి మరమ్మతు పనులు , గుండ్ల చెరువు చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్‌లను స్వయంగా పరిశీలించారు. శోభాయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు , రహదారి మరమ్మతు పనులు , పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగా ఏర్పాటు కావాలని , వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శోభాయాత్రలో భారీగా జనసమ్మర్థం ఏర్పడే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను సమర్ధవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్‌ను కఠినంగా అమలు చేయాలని , పలు కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమజ్జన ఘాట్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పటిష్టమైన బారికేడ్లు , లైటింగ్ , డ్రౌన్ ప్రూఫ్ జాకెట్లు , రక్షణ బృందాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఏసీ పి జె. వెంకటేశ్వర్ రెడ్డి , స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ , మున్సిపల్ సిబ్బంది చందు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమీషనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES