నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఊర పండుగ శోభయాత్రను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షించారు. ఊర పండుగ శోభయాత్ర రఘునాథ ఆలయం ఖిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై.. వివేకానంద చౌరస్తా , లక్ష్మీ మెడికల్, గాజుల్పేట్ , పెద్ద బజార్ , గోల్ హనుమాన్, పులాంగ్ చౌరస్తా, ఆర్య నగర్ , వినాయక నగర్ , దుబ్బ తదితర ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ప్రజలందరికీ ఊర పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఊర పండగ శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా సరి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రత్యేక ప్రాంతాలలో చుట్టుముట్టు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. రూట్ మ్యాప్ ప్రకారంగా శోభయాత్ర నిర్వాహకులు ప్రజలు పోలీస్ బందోబస్తుకు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి , ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు , ఎస్సైలు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఊర పండుగ శోభయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
- Advertisement -
- Advertisement -