నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హల్ లో నిజామాబాద్ పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో విధులు నిర్వర్తిస్తూన్న సిబ్బందికీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నుంచి వచ్చినటువంటి పోలీస్ మహోన్నత సేవా పథకం, పోలీస్ ఉత్తమ సేవ పథకాలు, పోలీసు సేవ పథకాలు, అతి ఉత్కృష్ట సేవ పథకాలు, ఉత్కృష్ట సేవా పథకాలు మొత్తం 95 మొదలగు నవి వచ్చిన సందర్భముగా వాటిని నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు.
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చూపిన సేవా మనోభావం ప్రశంసనీయమైనది. సిబ్బంది సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పథకాలకు ఎంపిక చేసి పంపడం జరిగింది.ఈ రోజు వారి కృషిని గుర్తించి పతకాలు అందజేయడం నాకు ఎంతో గర్వకారణం. ఈ పతకాలు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు ఇది మీ సేవా స్పూర్తికి , కష్టపడి పనిచేసే నిబద్ధతకు ప్రతీక. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజాసేవలో మరింత ప్రతిభ చూపాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ( ఏఆర్ ) శ్రీ రామ్ చందర్ రావు, పతకములు పొందినటువంటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



