- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను భారత్ నెగ్గడంతో ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. హార్దిక్ పాండ్య జాతీయ జెండాను వీపునకు చుట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. దీనిపై పుణెకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ స్థానిక శివాజీనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హార్దిక్ చర్య జాతీయ జెండాను అగౌరవపరచడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.
- Advertisement -



