నవతెలంగాణ – గోవిందరావుపేట
అధునాతన టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న ఫోన్ కనిపెట్టి బుధవారం భాధితునికి పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ కమలాకర్ అందించారు. వివరాలలోకి వెళితే.. పసర పోలీసు స్టేషన్ యందు ఎస్ఐ కమలాకర్ 3 నెలల కిందట పోయిన రెడ్మీ ఫోన్ ను ఆధునిక సాంకేతికత ద్వారా తిరిగి భాదితునికి అందజేయటం జరిగింది. గోవిందరావు పేట మండలం ఎల్ బీ నగర్ గ్రామానికి చెందిన బొగ్గుల రవి అను వ్యక్తి బైక్ మీద 3 నెలల కిందట ఎల్ బి నగర్ నుండి పస్రా వస్తుండగా గోవిందరావు పేట సమీపంలో పడిపోయింది. వెంటనే పస్ర పోలీసు స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ స్పందించి వెంటనే సిఈఐఆర్ఆప్ ఆపరేటర్ కానిస్టేబుల్ రతన్ సింగ్ తో వివరాలను సేకరించి సిఈఐఆర్ వెబ్సైట్ లో పొందుపరిచి దాని యొక్క లోకేషన్ ఆధారంగా కనిపెట్టి భాధితుని కి ఆందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటె కనుక పోలీసు స్టేషన్ సంప్రదిస్తే పోయిన ఫోన్ సిఈఐఆర్ యాప్ ద్వారా కనిపెట్టవచ్చు అని తెలియజేయటం జరిగింది.
పోగొట్టుకున్న ఫోన్ కనిపెట్టి బాధితునికి అందించిన పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES